నాలుగేళ్లుగా నిర్మాణంలోనే.. కూలిన బ్రిడ్జి.. 9 రోజుల్లో ఐదో ఘ‌ట‌న‌ | Bihar Bridge Under Construction For 4 Years Collapses, 5th In 9 Days | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా నిర్మాణంలోనే.. కూలిన బ్రిడ్జి.. 9 రోజుల్లో అయిదో ఘ‌ట‌న‌

Jun 29 2024 1:31 PM | Updated on Jun 29 2024 1:40 PM

Bihar Bridge Under Construction For 4 Years Collapses, 5th In 9 Days

పాట్నా:  బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.

దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ వంతెనను భేజా పోలీస్ స్టేషన్‌లోని మాధేపూర్ బ్లాక్‌లో బీహార్‌ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఇది మధుబని – సుపాల్‌ జిల్లాల మధ్య భూతాహి నదిపై ఉంది.

అయితే, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ఉద్ధృతికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. 25 మీటర్ల పొడవు గల సపోర్టింగ్ పిల్లర్ దిగువన ఉన్న నదిలో కూలిపోయింది.

 రాష్ట్రంలో బ్రిడ్జి ప్ర‌మాదాల ఘ‌ట‌న‌పై  అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మండిప‌డ్డారు. కాగా, రాష్ట్రంలో గత తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇది ఐదో ఘటన కావడం గమనార్హం.ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే.

 

గురువారం కిషన్‌గంజ్‌ జిల్లాలో, జూన్‌ 23న తూర్పు చంపారన్‌ జిల్లాలో, 22న సివాన్‌లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి.  దీంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement