బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ అక్టోబర్‌లో  | Bihar Assembly elections held in October 2025 | Sakshi
Sakshi News home page

బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ అక్టోబర్‌లో 

Jun 26 2025 5:37 AM | Updated on Jun 26 2025 5:37 AM

Bihar Assembly elections held in October 2025

నవంబర్‌ మూడో వారానికల్లా ఎన్నికలు ముగించాలని ఈసీ యోచన 

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాది అక్టోబర్‌ తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి తుది ఓటరు జాబితాను ప్రకటించిన వెంటనే షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

243 మంది సభ్యులున్న బిహార్‌ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్‌ 22వ తేదీన ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది. ప్రస్తుతం బిహార్‌లో వచ్చే నాలుగు నెలల్లోగా ఓటర్ల జాబితా ఖరారుపై ఒక షెడ్యూల్‌ను కేంద్రం విడుదల చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement