నాన్నమ్మ అంత్యక్రియలకు అభిజీత్ దీప్కే | Abhijeet Dipke Heads To Maharashtra For Grandmother Funeral After Release, Vows To Continue Protest Against CEC | Sakshi
Sakshi News home page

నాన్నమ్మ అంత్యక్రియలకు అభిజీత్ దీప్కే

Oct 11 2026 1:38 PM | Updated on Oct 11 2026 2:42 PM

Abhijeet dipke heads home for Grandmothers last rites

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం మహారాష్ట్రలోని తన స్వగ్రామానికి బయలుదేరారు. ఆయన నానమ్మ సావిత్రీబాయి శంకర్రావు దీప్కే (85) అనారోగ్యంతో శనివారం ఉదయం 11.30 గంటలకు హింగోలీ జిల్లాలోని సంతుక్ పింప్రీ గ్రామంలో కన్నుమూశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు అభిజీత్ దీప్కే తన పార్టీ సహచరులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాతో కలిసి ముంబయి నుంచి ఢిల్లీకి వచ్చారు. అయితే వీరు ఢిల్లీలో దిగిన వెంటనే పోలీసులు ముగ్గురినీ విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడుదలైన అభిజీత్ తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహారాష్ట్రకు వెళ్లారు.

తాను స్వగ్రామానికి వెళ్తున్న విషయాన్ని అభిజీత్ దీప్కే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులతో ఉండేందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తన పార్టీ సహచరులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా త్వరలో ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. కుటుంబంలో విషాదం నెలకొన్నప్పటికీ తమ పార్టీ వెనక్కి తగ్గబోదని, బెదిరింపులకు భయపడబోదని స్పష్టం చేశారు.

‘నియంతృత్వానికి ముగింపు ప్రారంభం’
ఢిల్లీలో పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్న అక్టోబర్ 10వ తేదీని ‘నియంతృత్వానికి ముగింపు ప్రారంభం’గా అభిజీత్ అభివర్ణించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో తమ నిరసనలు కొనసాగుతాయని ఆయన సందేశం ద్వారా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ధ్రువ్ రాఠీ వివాదం: విదేశీయులు భారత్‌లో నిరసనలు తెలుపవచ్చా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement