మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి | 7 Dead After Auto Collides With Truck In Madhya Pradesh Chhatarpur, See Details Inside | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి

Aug 20 2024 12:16 PM | Updated on Aug 20 2024 12:48 PM

7 Dead After Auto Collides With Truck In Madhya Pradesh Chhatarpur

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్న భక్తుల ఆటో రిక్షా  ఛతర్‌పూర్‌ జిల్లాలో  వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు  పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  

సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి039 (ఝాన్సీ-ఖజురహో హైవే)పై కడారి ప్రాంతంలో తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఆటో రిక్షాలో 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారు మహోబా రైల్వే స్టేషన్ నుంచి భాాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్నారని ఆయన తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement