కశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌  | 6 Terrorists Arrested in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌ 

Mar 19 2022 7:46 AM | Updated on Mar 19 2022 8:01 AM

6 Terrorists Arrested in Kashmir - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో లష్కరేతోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఆయుధ సరఫరా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షితుల్ని చేయడం వంటి చర్యలతో వీరికి సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

పుల్వామా జిల్లా కాకాపొరాకు చెందిన లష్కరే కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ దార్‌ అలియాస్‌ ఖాలిద్, అలియాస్‌ షీరాజ్‌ నేతృత్వంలో వీరు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కూడా వెల్లడైందని పోలీసు శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement