New Covid Cases In India Last 24 Hours: 51667 New Covid Cases Reported In India - Sakshi
Sakshi News home page

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

Jun 25 2021 10:05 AM | Updated on Jun 25 2021 2:37 PM

51667 New Corona Cases Recorded In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,667  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో  1,329 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 3,93,310 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 64,527 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.


దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,91,28,267 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం  6,12,868 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,01,34,445  మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 30,79,48,744 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. గత 24 గంటల్లో 17,35,781 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 39,95,68,448 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


చదవండి: పాక్‌ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్ని కట్టడి చేయాలి

Advertisement
 
Advertisement
Advertisement