అస్సాంలో రోడ్డు ప్రమాదం.. 32 మంది జవాన్లకు గాయాలు | Assam Bus Accident Kills Driver And Injures 32 BSF Personnel On National Highway 27 Check More Details Inside | Sakshi
Sakshi News home page

అస్సాంలో రోడ్డు ప్రమాదం.. 32 మంది జవాన్లకు గాయాలు

Oct 9 2026 8:43 AM | Updated on Oct 9 2026 10:19 AM

32 bsf jawans injured in road accident in assam

దిస్ఫూర్‌: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బార్పేటా జిల్లాలో జాతీయ రహదారి 27పై బీఎస్‌ఎఫ్  సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆ బస్సు డ్రైవర్‌ మృతిచెందగా అందులో వెళుతున్న 32 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో  14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని వెనువెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ఆ రాష్ట్రంలో జరిగిన  ఎన్నికల విధులు పూర్తి చేసుకుని బీఎస్‌ఎఫ్ జవాన్లతో   ధుబ్రి వైపు తిరిగివస్తుంది... ఆ సమయంలో హౌలీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్రక్కు ముందువైపు భాగాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఒక జవాను పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన గాయపడిన జవాన్లకు కూడా వైద్య చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సాంసుల్ హక్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన గోల్‌పారా జిల్లాలోని షిమ్లిటోలా పరిధిలో ఉన్న గరోయిమారీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే హౌలీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement