యూపీలో ఉద్రిక్తత, ముగ్గురు మృతి.. 30మందికి పైగా పోలీసులకు గాయాలు | 3 Dead, Over 30 Cops Injured: Violence In Uttar Pradesh Sambhal Over Survey | Sakshi
Sakshi News home page

యూపీలో ఉద్రిక్తత, ముగ్గురు మృతి.. 30మందికి పైగా పోలీసులకు గాయాలు

Nov 24 2024 7:51 PM | Updated on Nov 24 2024 7:55 PM

3 Dead, Over 30 Cops Injured: Violence In Uttar Pradesh Sambhal Over Survey

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరాన్ని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.  

పోలీసుల కథనం ప్రకారం..అడ్వకేట్ కమీషనర్ నేతృత్వంలోని సర్వే బృందం సర్వే చేసేందుకు ప్రార్థనా మందిరంలోకి అడుగుపెట్టింది. అయితే, ఆ సర్వేను అడ్డుకునేందుకు వెయ్యికి మందికి పైగా స్థానికులు ప్రయత్నించారు. పోలీసుల్ని ప్రార్థనా మందిరంలోకి వెళ్లకుండా వాగ్వాదానికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. అధికారుల వాహనాలకు నిప్పంటించారు.  

అయితే, స్థానికుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు మరణించారు. 30మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి’ అని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం, పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement