జైపూర్‌లోని ఏనుగుల గ్రామంలో (హాథీ గావ్ లేదా ఎలిఫెంట్ విలేజ్) ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగస్టు 12) సందర్భంగా 21 ఏనుగులతో ప్రత్యేక ప్రదర్శన (ర‍్యాంప్ వాక్) నిర్వహించారు. ఈ . ఫ్యాషన్ షోలొ 'బాబు' అనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ. 62 లక్షల విలువైన రాచరిక కాలపు వెండి ఆభరణాలు ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచింది ఈ ఆభరణాలను జైపూర్ రాజకుటుంబం పూర్వకాలంలో బాబు యజమాని షాహిద్ ఖాన్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చారట.
మొత్తం 21 ఏనుగులు 50 మీటర్ల పొడవైన రెడ్ కార్పెట్‌పై రాచరిక శైలిలో హొయలొలికించాయి. బాబుతో పాటు చంద, పుష్ప, హేమ వంటి ఇతర ఏనుగులు కూడా పాల్గొనగా, మావటీలు సాంప్రదాయ రాజస్థానీ దుస్తుల్లో ఈ షోలో మెరిసారు. ఈ సందర్భంగా ఏనుగులకు పండ్ల విందు ఏర్పాటు చేశారు.ప్రపంచ ఏనుగుల దినోత్సవంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఛాయలు కూడా ఈ కార్యక్రమంలో కనిపించాయి. ఏనుగులు త్రివర్ణ పతాకంతో ర్యాంప్ వాక్ చేయడం సందర్శకుల్లో దేశభక్తి భావాన్ని నింపింది.
ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’
ఫ్రూట్ బఫే & కేక్ కటింగ్
ఫ్యాషన్ షో అనంతరం ఏనుగుల కోసం అరటిపండ్లు, పుచ్చకాయలతో ప్రత్యేక 'ఫ్రూట్ బఫే' ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఏనుగులు తమ తొండంతో కేక్ కట్ చేయడం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దేశీయ మరియు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ మొబైల్ ఫోన్లలో ఈ అందమైన దృశ్యాలను బంధించారు. కొందరు విదేశీ పర్యాటకులు సాంప్రదాయ రాజస్థానీ దుస్తులు ధరించి ఏనుగులపై సవారీ చేస్తూ తరలివచ్చారు.
ఇదీ చదవండి: మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్య


