యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్‌! | 10 Days Before Daughter Wedding: Up Woman Elopes With Would Be Son In Law | Sakshi
Sakshi News home page

యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్‌!

Apr 9 2025 8:20 PM | Updated on Apr 9 2025 9:15 PM

10 Days Before Daughter Wedding: Up Woman Elopes With Would Be Son In Law

పది రోజుల్లో కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రాలు పంచి.. బంధువులను కూడా ఆహ్వానించారు. అంతలోనే షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది.  ఆమె తల్లి తన కాబోయే భర్తతో పారిపోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నాలుగు నెలల క్రితం ఓ మహిళ తన కూతురు వివాహం చేసేందుకు ఓ సంబంధం చూసింది. ఓ యువకుడితో తన కుమార్తెకు పెళ్లి చేయడానికి నిశ్చయించింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తల్లి తనకు కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన రూ. 5 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు 5.5 లక్షలకు పైగా నగదు కూడా తనతో తీసుకెళ్లింది.

అయితే పెళ్లి  కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన అత్తకు మొబైల్ ఫోన్‌ బహుమతిగా అందించాడు. తరుచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడే వాడు. పలుమార్లు అత్త ఇంటికి రావడంతో పాటు, గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో అల్లుడితో ప్రేమలో పడిన అత్త, పెళ్లికి మరో పది రోజులు ఉందనగా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని, అతడితో పారిపోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై  పోలీస్ అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement