
No Headline
మా తల్లిదండ్రుల పేరిట ఉన్న 8 ఎకరాలు మొత్తం ప్రాజెక్ట్‌లోనే పోయింది. పరిహారం కింద వచ్చిన డబ్బులను మా తల్లిదండ్రుల పేరిట రూ.10 లక్షలు, నా పేరిట మరో రూ.2 లక్షలు ఫైనాన్స్ కంపెనీలో జమచేశాం. 2019లో డబ్బులు జమచేస్తే నాలుగేళ్లయినా తిరిగి ఇవ్వలేదు. మా అమ్మ లక్ష్మమ్మకు పక్షవాతం వస్తే, చికిత్స చేయించేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ఏడాది కిందట చనిపోయింది. జీవనాధారమైన భూములు కోల్పోయి, డబ్బులు పోగొట్టుకుని అరిగోస పడుతున్నాం.
– అలివేలు, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి