
జోరు వాన..
నారాయణపేట: వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పగలు ఎండ, ఉమ్మరంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. రాత్రి వేళలో ఎక్కడపడితే అక్కడ రెండు, మూడు గంటల పాటు వర్షం దంచికొడుతుంది. జిల్లాలో అత్యధిక వర్షపాతం మద్దూరు మండలంలో నమోదు కాగా నారాయణపేట, ధన్వాడ, గుండుమాల్‌లో సాధారణ వర్షపాతం, మిగతా 9 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో జూన్, జూలైలో వర్షాలు అంతంత మాత్రంగానే పడ్డాయి. కానీ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని 769 చెరువులు, కుంటలు, భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతుంది.
అత్యవసర సమయంలో..
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో వర్షాలతో ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే కంట్రోల్‌రూం ఫోన్ నంబర్ 9154283913 సమాచారం ఇవ్వాలన్నారు.
జిల్లాలోని చెరువుల్లో చేరిన నీటి శాతం ఇలా..
బయటికి వెళ్లాలంటేనే..
జిల్లాలో మండలాల వారీగా వర్షం మి.మీలో
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు
రాకపోకలకు ఇబ్బందులు
భారీ వర్షాలు వస్తే మక్తల్ మండలంలోని కర్నె చెరువు వద్ద, చిట్యాల, ముసలయ్యపల్లి, పారేవుల గ్రామాల మధ్య ప్రధాన కల్వర్టులు వద్ద రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుంది. కల్వర్టుపైన నాలుగు ఫీట్ల ఎత్తు వరకు నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. పసుపుల సమీపంలో దత్తక్షేత్రం, కురుమగడ్డ, నారగడ్డ, రామలింగేశ్వర ఆలయాలు ఉండడంతో మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని భక్తులు వస్తుంటారు. కల్వర్టు ఎత్తు పెంచాలని ఆయా గ్రామాల ప్రజలకు కోరుతున్నారు. ఊట్కూర్ మండలంలోని మల్లెపల్లికి వేళ్లే రహదారిలో కల్వర్టుపై వరద పారుతుండడంతో వారం రోజులుగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
పలు గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు
నిండుతున్న చెరువులు, పారుతున్న కుంటలు
మద్దూర్ మండలంలో అత్యధిక వర్షపాతం
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9154283913