
ముమ్మరంగా వరి నాట్లు
మక్తల్: మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం అంటే ఒకప్పుడు వలసల ప్రాంతంగా పేరొందింది. కానీ నియోజకవర్గంలో సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల ద్వారా ఆయకట్టుకు నీరు వదులుతుండడంతో వలసలు తగ్గి గ్రామాలు కళకళలాడుతున్నాయి. దీంతో రైతులు ఏడాదిలో వానాకాలం, యాసంగి రెండు పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. భూత్పూర్ రిజర్వాయర్ కింద మక్తల్, నర్వ మాగనూర్, కృష్ణ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో 45 వేల ఎకరాల ఆయకట్టు, సంగంబండ రిజర్వాయర్ ద్వారా మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లోని 65 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గంలో 1.10లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది.
కృష్ణా నది నుంచి..
కృష్ణానది బ్యాక్ వాటర్‌లో భాగంగా పంచదేవవ్‌పహాడ్ భీమా కాల్వ స్టేజ్ 1 నుంచి చిన్నగోప్లాపూర్ పంప్‌హౌజ్‌కు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వ రెగ్యూలేటర్ ద్వారా భూత్పూర్ రిజర్వాయర్‌కు, కానాపూర్‌కు నీరు వస్తుంది. కానాపూర్ స్టేజ్ 2 నుంచి సంగంబండ రిజర్వాయర్‌ను నింపుతారు. అనంతరం కాల్వ ద్వారా మక్తల్ చెరువును నింపుతారు. సంగంబండ బ్యాక్‌వాటర్ నుంచి ఉజ్జెల్లి, సోమేశ్వర్‌బండ, మాద్వార్, సంగంబండ గ్రామాలకు చెందిన రైతులు పైపులైన్ల నుంచి పంటలు సాగు చేసుకుంటున్నారు.
సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కింద ఆయకట్టు
1.1లక్షల ఎకరాలకు సాగునీరు