
మాకో న్యాయమా?
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని గంధమల్ల రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.24 లక్షలు పరిహారం ప్రకటించినా రైతులు ముందుకు రావడం లేదు. పేట– కొడంగల్ ప్రాజెక్టులో ఎకరాకు రూ.14 లక్షలు ఇవ్వడం న్యాయమేనా? ఇప్పటికై నా ఎకరాకు రూ.30 లక్షలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– కేశవులు, భూ నిర్వాసితుడు, కాట్రేవుపల్లి, మక్తల్ మండలం
ముంపు గ్రామంగా ప్రకటించాలి
ఊట్కూర్ గ్రామానికి 100 మీటర్ల దూరంలో పెద్ద చెరువు ఉంది. ఇప్పటికే చెరువు నిండితే ఇంటి పరిసరాల్లో ఊట నీరు వస్తుంది. భవిష్యత్తులో రిజర్వాయర్ నిర్మిస్తే ఊరంతా ఊటవచ్చే పరిస్థితి ఉంది. విష పురుగులు, పాముల బెడద, రోగాలు ప్రబలే అవకాశం లేకపోలేదు. అందుకే గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. – వడ్ల మోనప్ప,
మాజీ వార్డు సభ్యుడు, ఊట్కూర్
ప్రభుత్వం స్పందించాలి
భూ నిర్వాసితులు గత 26 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.30 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి.
– బలరాం, భూ నిర్వాసితుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నారాయణపేట
●

మాకో న్యాయమా?