
సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలి
ధన్వాడ: అదివాసుల సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు ఇప్పటి విద్యార్థులు తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ రాజారాం అన్నారు. ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోరాటయోధడు కొమరం బీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి ఆదివాసి హక్కులను గుర్తించిందని అన్నారు. 1994 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రాఖీపండుగ వేడుకలను నిర్వహించారు. ఇందులో వైస్‌ప్రిన్సిపల్ సాంబయ్య, సాయిబాబు, నరేంద్రమూర్తి, తిమ్మప్ప, నరేందర్, గోపినాయక్, లాలుప్రసాద్, సంజీవ్, నర్సిములు, రుక్మిణిబాయి తేజ పాల్గొన్నారు.