
‘సంగంబండ’ మూడు గేట్లు ఎత్తివేత
మక్తల్: ఎగువ నుంచి వస్తున్న వరదతో మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ సంగంబండ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆదివారం మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ డీఈ సురేష్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని ఇడ్లూర్ పెద్దవాగు నుంచి రిజర్వాయర్‌కు వరద కొనసాగుతుందన్నారు.
దేశభక్తికి యాత్ర స్ఫూర్తి
నర్వ: అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజ్లింగ్ రాజ్ కలశ యాత్ర దేశభక్తికి, యాదవుల ఐక్యతకు స్ఫూర్తినిస్తుందని నర్వ మండల యాదవ సంఘం అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన ఈ యాత్రకు ఆదివారం నారాయణపేట జిల్లాలో సంఘీబావం తెలుపుతూ.. స్వాగతం పలికామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాత్రతో భారత యాదవ జవాన్ల వీరత్వాన్ని, దేశభక్తిని, అహిర్ రెజిమెంట్ ఆవస్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లే మహా ఉద్యమంగా కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు అయ్యలన్న యాదవ్, శేఖర్‌యాదవ్, గుర్లపల్లి మొగిలప్ప, రామంచంద్రి, ఎర్రగుంట వెంకటప్ప, కుర్వ అయ్యలప్ప తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
నారాయణపేట క్రైం: ప్రజలు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల మోసపూరిత ప్రకటనలను చూసి అత్యాశకు పోయి మోసపోవద్దని ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్నారు. అధిక లాభాలకు ఆశపడి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టొద్దని, సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్‌ను చూసి మోసపోవద్దన్నారు. ఆన్‌లైన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు లేదా 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందిచాలన్నారు.
రాఘవేంద్రస్వామి
ఆరాధనోత్సవాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని పరిమళగిరిపై వెలసిన రాఘవేంద్రస్వామి మఠంలో 354వ ఆరాధన ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పూర్వారాధన వేడుకలు, వివిధ పూజా కార్యక్రమాల ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సు ప్రభాతసేవ, పాదపూజ, కనకాభిషేకం, వివిధ రకాల ఫలాలతో కూడిన ఫలపంచామృతాభిషేకం చేశారు. అర్చకులు స్వామివారి బృందావనానికి అభిషేకం జరిపారు. అలాగే అష్టోత్తర పారాయణం, తులసి అర్చన, నైవేద్యం, అనంతరం స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించారు. హస్తోదకం, మహామంగళహారతి ఇచ్చి.. సాయంత్రం స్వామివారిని మఠం ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివా రి ఆరాధనోత్సవాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. ఆరా ధనోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యారాధన వేడుకలు జరపనున్నారు.
రిజర్వేషన్లను ఆమోదించాలి
అడ్డాకుల: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, లేదంటే బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మయ్య అన్నారు. బీసీ బిల్లును ఆమోదించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అడ్డాకులలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పేదల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని, ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించకుండా అడ్డుపడుతుందని విమర్శించారు.

‘సంగంబండ’ మూడు గేట్లు ఎత్తివేత

‘సంగంబండ’ మూడు గేట్లు ఎత్తివేత