
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
వాలీబాల్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్ అకాడమీకి ఎంపికై నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎస్‌జీఎఫ్ అండర్– 14, అండర్– 14 రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాను. గతేడాది సీఎం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా ద్వితీయ స్థానం వచ్చింది. భవిష్యత్‌లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఎదగడంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా.
– ప్రశాంత్, పల్లెగడ్డ, మహబూబ్‌నగర్
రెండేళ్ల నుంచి ప్రాక్టిస్
మొదటిసారి వాలీబాల్ అకాడమీకి ఎంపికయ్యాను. రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ చేస్తున్న. సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్‌కు వెళ్లాను. ఈ రెండింట్లో కూడా ఎంపికయ్యాను. కానీ, మహబూబ్‌నగర్ అకాడమీలో చేరాను. ఇక్కడ వసతులు బాగున్నాయి. అటాకర్‌గా శిక్షణ తీసుకుంటున్న.
– నరేష్, ఇప్పలపల్లి, రంగారెడ్డి

ఉద్యోగం సాధించడమే లక్ష్యం..

ఉద్యోగం సాధించడమే లక్ష్యం..