
అంజనీపుత్రా.. పాహిమాం
మద్దూరు: మండలంలోని దోరేపల్లి శివారులో తండాలో ఆంజనేయస్వామి జాతర అంగరంగ వైభవంగా సాగాయి. శనివారం దోరేపల్లి గ్రామంలోని వీరప్ప ఇంటి నుంచి స్వామివారి ప్రతిమను ఎండ్లబండ్ల ఊరేగింపు నడుమ ఆయానికి తీసుకువచ్చారు. గ్రామస్తులు అలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. బావి నుంచి నీటిని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. జాతర సందర్భంగా మిఠాయిలు, ఆట వస్తువుల దుకాణాల్లో రద్దీ నెలకొంది. జాతరలో ఎలాంటి అంవచానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
దోరేపల్లి నుంచి స్వామివారిని ఎడ్లబండ్ల ఊరేగింపు నడుమ ఆలయానికి తీసుకొస్తున్న భక్తులు
కల్యాణ..
వైభోగమే