
భూ నిర్వాసితులకు అన్యాయం చేయొద్దు
● కాడెద్దులతో పాదయాత్రగాజిల్లాకేంద్రానికి వచ్చిన నిర్వాసితులు
నారాయణపేట రూరల్: జీఓ 69 కింద నిర్మిస్తున్న నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు అన్యా యం చేయొద్దని నిర్వాసితులు డిమాండ్ చేశారు. భూనిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పేరపళ్ల నుంచి కాడెద్దులతో నారాయణపేట జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి పాదయా త్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ అమ్మకో ళ్లు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. బహిరంగ మార్కె ట్‌కు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం భూనిర్వాసితులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నా రు. ఈ ప్రాంతానికి నీళ్లు రావడం ఎంతో సంతోషదాయకమని.. అదే సమయంలో ఇంత ముఖ్యమైన ప్రాజెక్టుకు త్యాగం చేస్తున్న భూనిర్వాసితులకు న్యా యం చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు న్యా యం అందే దాకా ఈ పోరాటం, ఉద్యమం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. భూ నిర్వాసితుల సమస్యపై పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసినా.. న్యాయం చేసేందుకు ముందుకు రావడంలో ఆలస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ అమరేందర్ కృష్ణ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వేపూర్ రాము లు, ఆంజనేయులు, కాశీనాథ్, మచ్చేందర్, బలరాం, గోపాల్, ధర్మరాజు, భీమప్ప పాల్గొన్నారు.