
బెడ్ల కొరత
ఐదు రోజుల క్రితం కలరా సోకడంతో ఆస్పత్రికి వచ్చి, అడ్మిట్ అయ్యాను. ఒకే బెడ్‌పై నాతో పాటు మరో వ్యక్తికి వైద్యం చేశారు. మూడు రోజులు పాటు ఆస్పత్రిలో ఒకే బెడ్ ఇద్దరం సైలెన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
– దేవప్ప, నర్సపూర్, దామరగిద్ద మండలం
ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాలి
నాకు తీవ్ర జ్వరం రావడంతో వైద్యం కోసం మద్దూరు ఆస్పత్రికి వచ్చాను. రెండు రోజులగా వైద్యం అందించారు. కానీ కొన్ని రకాల మందులకు బయటికి పంపుతున్నారు. మంచాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.
– మల్లమ్మ, లోకుర్తి, దామరగిద్ద మండలం
పోస్టులు మంజూరు కాలేదు
స్థానిక సీహెచ్‌సీకి నిత్యం రోగులు వస్తుంటారు. 30 పడకలు ఏ మాత్రం సరిపోవడం లేదు. అలాగే పోస్టులు మంజూరు కాకపోవడంతో జిల్లాలోని వివిధ ఆస్పత్రులో పనిచేస్తున్న వారిని ఇక్కడికి డిప్యూటేషన్‌పై వేశారు. నేను కూడా డిప్యూటేషన్‌పైనే వచ్చాను. ప్రస్తుతం ఆస్పత్రిలో ఈసీజీని త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. స్కానింగ్, ఆక్సిజన్ సౌకర్యం గురించి నాకు తెలియదు.
– పావని, మద్దూరు సీహెచ్‌సీ సూపరింటెండెంట్
●

బెడ్ల కొరత

బెడ్ల కొరత