భూ నిర్వాసితులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితులకు అండగా ఉంటాం

Aug 14 2025 10:20 AM | Updated on Aug 14 2025 10:20 AM

భూ నిర్వాసితులకు అండగా ఉంటాం

భూ నిర్వాసితులకు అండగా ఉంటాం

ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట: పేట–కొడంగల్‌ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి భరోసానిచ్చారు. ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన ఊట్కూరు మండలం బాపూర్‌, దామరగిద్ద మండలంలోని బాపన్‌పల్లి, నారాయణపేట మండలంలోని పేరపళ్ల, కౌరంపల్లి శివారులోని దాదాపు 71 మంది రైతులకు చెందిన 51.36 ఎకరాల భూమికి సంబంధించిన రూ.7.7 కోట్ల నష్టపరిహారం చెక్కులను బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాంచందర్‌నాయక్‌ తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.

రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలే..

ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కింద భూములు ముంపునకు గురయినా ఇంత వరకు రైతులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదని, సీఎం రేవంత్‌రెడ్డి చొరవతోనే స్థానిక రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇన్నేళ్లు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం ఎత్తిపోతల పథకం పూర్తయితే సస్యశ్యామలం అవుతుందన్నారు. భూనిర్వాసితులు నిరాశ చెందొద్దని, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతుల మేలు మరచిపోలేమని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, దామరగిద్ద విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు తహసీల్దార్లు అమరేంద్రకృష్ణ, తిరుపతయ్య, చింత రవి, ఆర్డీఓ ఆఫీస్‌ డీటీ బాల్‌రాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం, మధు, కోట్ల రవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రైతు సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి

మరికల్‌: ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మరికల్‌లోని నారాయణపేట రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని, ఆ దిశగా రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. అనంతరం దుకాణ యాజమాని ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, రఘుపతిరెడ్డి, నాగిరెడ్డి, కృష్ణయ్య, హరీష్‌, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, రాములు, శ్రీకాంత్‌రెడ్డి, రాజు, చెన్నయ్య, సత్యానారాయణ, దస్తన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement