
మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత
మాగనూర్: మొక్కలు సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్ కోరారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎంపీడీఓ శ్రీనివాసులుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి మనుగడకు ఆక్సిజన్ ఎంతో అవసరమన్నారు. మొక్కలు పెంచడం వల్ల సహజ సిద్ధంగా ఆక్సిజన్ లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రకృతి సహకరిస్తేనే సకల జీవకోటికి మనుగడ ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలు మన పూర్వీకులు మాదిరిగా ఆహారంలో చిరుధాన్యాలను భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్‌ల్లో టీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. యోగా జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి అఫ్రోజ్, ఏపీఓ మన్యం, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.