
No Headline
పరిహారం డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఇప్పటికే దాదాపు 150 మంది చనిపోయారు. ఆర్‌అండ్‌ఆర్ కమిటీ చైర్మన్‌గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్‌రెడ్డి ప్రోద్బలంతోనే అందరూ ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్‌లో డబ్బులు పెట్టారు. ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబుతో కలిసి పక్కా ప్లాన్‌తో బోర్డు తిప్పేశాడు. ఫైనాన్స్ కంపెనీ వాళ్లు కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చి.. వారి ఆస్తులను గ్రామాల వారీగా బాధిత రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. మాకు పరిహారం చెల్లించకుంటే.. పోరు కార్యాచరణ ప్రకటించి.. ఆందోళన చేపడతాం. ఆయా నిందితుల ఇంటి వద్ద వాంటావార్పు వంటి కార్యక్రమాలు చేపడతాం. మా బాధను అందరూ అర్ధం చేసుకోవాలి. – బంగారయ్య, బాధితుడు, బండరాయిపాకుల