
నేత్రపర్వంగా మహారథోత్సవం
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఉత్త ర ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మహారథోత్సవ వేడు కలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలతో పాటు సుప్రభాతం, నిర్మల్యం, పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ, భజ న, పల్లకీసేవా, మహిళల కోలాటాలతో కనకాభిషేకం చేశారు. అనంతరం మహా నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నర్సింహాచారి, అనిల్‌దేశాయి, శ్రీపాద్, రఘు ప్రేమ్, రాఘవేంద్ర, బీంసేన్‌రావు, శేషు, సీతారామరావ్, ధరణిధర్, శ్రీధర్‌రావు, గోపినాథ్, మంజునాథ్ పాల్గొన్నారు.