
29వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు
నారాయణపేట: నారాయణపేట–కొడంగల్–ఎత్తిపోత ఎత్తిపోతల పథకం భూనిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు మశ్చందర్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి బల్‌రామ్ పూలదండలు వేసి ప్రారంభించి మాట్లాడారు. మార్కెట్ ధర కనుగుణంగా పరిహారం అందించాలని రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బలవంతపు భూసేకరణ ఆపాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్నారు. భూ నిర్వాసితుల గోడును ప్రభుత్వం పెడచెవిన పెడితే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో చేపట్టిన వారిలో భీంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆశప్ప, అశోక్, దానప్ప, అన్వర్ చంద్రశేఖర్, అశోక్ , జైపాల్ గౌడ్, రాములు , వెంకటప్ప, మాశప్ప, అబ్దుల్ వహీద్ , చాకలి నర్సప్ప ఉన్నారు.