ముగ్గురు పిల్లల్లో ఎవ్వరికీ రాలేదు | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లల్లో ఎవ్వరికీ రాలేదు

Jul 20 2026 1:38 AM | Updated on Jul 20 2026 1:38 AM

ముగ్గురు పిల్లల్లో ఎవ్వరికీ రాలేదు

మాకు ముగ్గురు పిల్లలు, 2025–26 విద్యా సంవత్సరంలో నఖియా 8వ తరగతి, తెహసీన్‌ 9వ తరగతి, అయాజ్‌ అలీ 10వ తరగతి చదివారు. వీరిలో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం కింద నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం డబ్బులు పడ్డాయి. 300 యూనిట్ల కరెంట్‌ బిల్లు నింబంధన పేరుతో గతేడాది అనర్హులుగా చూపించారు. మాది ఉమ్మడి కుటుంబానికి చెందినదిగా అధికారులతో ధ్రువీకరించి మళ్లీ దరఖాస్తు చేసుకున్నా పడలేదు. ఈ సంవత్సరమైనా పడతాయో లేదో చూడాలి.

– సయ్యద్‌ ముర్తుజాబీ, పాములపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement