కుందూనదిలో తాబేలు పుర్రె
కరువు పరిస్థితులకు సాక్ష్యం ఈ దశ్యం. జీవనదిలా ప్రవహించే కుందూనది ఒట్టిపోయి రాళ్లు, రప్పలు దర్శనమిస్తున్నాయి. నీరు అడుగంటి పోవడంతో జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. నదిలో ఎక్కడ చూసినా చేపలు, పీతలు చనిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కాకులు, కొంగలకు ఆహారంగా మారుతున్నాయి. ఓ తాబేలు పుర్రెను చూస్తే.. అయ్యో అనిపించేలా చలింపజేస్తుంది. ఉన్న ఫలంగా నీరు ఎండిపోవడంతో ఓ తాబేలు మృత్యువాత పడటం, కళేబరాన్ని కొంగలు తినేయడంతో పుర్రె మాత్రం మిగిలి కరువు ప్రమాద ఘంటికలను హెచ్చరిస్తూ కనిపిస్తోంది. – దొర్నిపాడు


