శ్రీరాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీరాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు

Jul 16 2026 5:48 AM | Updated on Jul 16 2026 5:48 AM

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.3,71,35,259 కోట్లు సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. జూన్‌ 23 నుంచి జూలై 14 తేది వరకు సంబంధించి 22 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. నగదు రూపేణా రూ 3,60,37,959.. నాణేలా రూపంలో రూ.10,97,300 వచ్చినట్లు వివరించారు. అలాగే 23 గ్రాముల బంగారం, 1085 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్‌ ఎస్‌.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌–2 వెంటేష్‌ జోషి, ఇంజనీర్‌ సురేష్‌కోనాపూర్‌, అనంతపురాణిక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement