బనగానపల్లె రూరల్: యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.33.28 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ పాండురంగారెడ్డి తెలిపారు. మంగళవారం హుండీ కానుకలు లెక్కించగా.. రూ. 33,28,573 నగదు, 68 గ్రాముల వెండి, గ్రాము బంగారం వచ్చిందన్నారు. ఈ ఆదాయం 109 రోజులకు సంబంధించిందన్నారు. కానుకల లెక్కింపులో ఆలయ పర్యవేక్షణాధికారి శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్వామి సేవకులు పాల్గొన్నారు.
ఏఎస్పీ సుస్మిత బాధ్యతల స్వీకరణ
బొమ్మలసత్రం: నంద్యాల డివిజన్ ఏఎస్పీగా ఐపీఎస్ అధి కారిణి సుస్మిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక కార్యాల యం వద్దకు చేరుకు న్న ఆమెకు డీఎస్పీ రామాంజినాయక్ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ఆమెను ఆశీర్వదించి తీర్థ్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. విధినిర్వహణలో ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టండి
కొత్తపల్లి: నాటు సారా తయారీ, మద్యం అక్రమ విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ పోలీసు సిబ్బందికి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల రైతులు, ప్రజలు, జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. శాంతిభద్రభతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో స్నేహపూర్వంగా మెలగాలని సూచించారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ జయశేఖర్ గౌడ్ ఉన్నారు.
రైతు ఉత్పత్తి దారులసంఘాలకు ఆర్థ్ధిక సహకారం
నంద్యాల(అర్బన్): రైతు ఉత్పత్తి దారుల సంఘా ల ఆర్థ్ధిక సహకారం అవసరమని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ అనిల్‌కుమార్, ఆర్‌బీఐ ఎల్‌డీఓ రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ(డీసీసీ) డిస్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో బ్యాంకుల రుణాల పంపిణీ, వార్షిక రుణ ప్రణాళిక అమలు, ప్రభుత్వ పథకాల పురో గతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ, ఇతర రంగాల్లో 136.32 శాతం రుణాల సాధన నమోదు అయినా ఇంధన రంగంలో 527 శాతం సాధన వల్లే పురోగతి పెరిగిందన్నారు. ఈ రంగంలో రూ.937 కోట్ల లక్ష్యానికి గాను రూ.49 కోట్ల మేర రుణాలు మంజూరైనట్లు తెలిపారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు బ్యాంకు రుణాల అనుసంధానం ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించి సంఘాలకు తగిన ఆర్థిక సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం కార్తిక్, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


