తరుముకొస్తోంది మంచినీటి ముప్పు | - | Sakshi
Sakshi News home page

తరుముకొస్తోంది మంచినీటి ముప్పు

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

గతేడాది కుందూనదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతున్న నది

దొర్నిపాడు: వర్షాలు ముఖం చాటేశాయి. ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో జలాశయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహించాల్సిన నదులు అడుగంటాయి. జూన్‌ నెల నుంచే జలకళను సంతరించుకునే కుందూనదిలో ప్రస్తుతం చుక్కనీరు లేకుండా పోయింది. నది అంతా రాళ్లు తేలి వెలవెలబోతుంది. నది పరివాహక ప్రాంతాల్లో మంచినీటి ముప్పు తరుముకొస్తోంది. మంచినీటి పథకాలకు నీరు సరఫరా చేసే పరిస్థితి రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రస్తుతం గుంతల్లో ఊటనీటితో నీటిని అందిస్తున్నారు. కుందూ ఆయకట్టు సాగుకు నోచుకోలేదు. కనీసం నారుమళ్లు కూడా కనిపించడం లేదు. గతేడాది ఇదే నెలలో క్రిష్టిపాడు గ్రామ వంతెన మీద నీరు పారుతుండగా ప్రస్తుతం బోసిపోయి కనిపస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement