వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కల్లూరు: ఎన్నికల కమిషన్ ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియ గడువును మరో పది రోజులు పొడిగించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరు అర్బన్ పరిధిలోని 19, 20, 21, 32, 35, 37, 41వ వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కాటసాని రాంభూపాల్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ పెంచిన సర్ గడువును అర్హులైన ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? ఎంత మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు? ఎంతమంది ఫారాలను పూర్తి చేశారని తదితర వివరాలను బీఎల్‌ఓలను, సూపర్‌వైజర్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించిన ఓటర్ల వివరాలను డిజిటైజేషన్ చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట ఆయా వార్డుల మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
కాటసాని రాంభూపాల్‌రెడ్డి


