ఎల్‌నినో మానిటరింగ్‌ బృందం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో మానిటరింగ్‌ బృందం ఏర్పాటు

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

నంద్యాల(అర్బన్‌): జిల్లాలో సాగు అయ్యే పంట లపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం జిల్లా స్థాయిలో ఎల్‌నినో మానిటరింగ్‌ బృందాన్ని ఏర్పా టు చేశారు. బృందంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు అశోక్‌కుమార్‌, మల్లేశ్వరరెడ్డి, నజీరుద్దీన్‌, వ్యవసా య ఉప సంచాలకులు గంగాధర్‌రావు, మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు ఉన్నారు. మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వారు నంద్యాల మండలం మునగాల, రాయమాల్పురం గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సకాలంలో సాంకేతిక సూచనలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వర్ష్షపాత పరిస్థితులు, పంటల స్థితి గతులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, రైతులకు వ్యవసాయ సలహాలు అధికారుల ద్వారా అందించడం ఎంతో ఉపయోగకరమన్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జూలై నెలలో జిల్లాలో 116 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 6.మి.మీ మాత్రమే నమోదు కావడంతో 30 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement