రూ.10 లక్షల ఎరువుల అమ్మకాలు నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల ఎరువుల అమ్మకాలు నిలిపివేత

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

చాగలమర్రి: ముత్యాలపాడు గ్రామంలో రెండు ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ దుకాణాల్లో రూ.10 లక్షల ఎరువుల అమ్మకాలను నిలిపివేసినట్లు స్థానిక ఏఓ రంగనేతాజీ మంగళవారం తెలిపారు. స్థానిక శ్రీలక్ష్మీ ఆగ్రో టెక్‌లో రూ. 8.50 లక్షల విలువైన ఫర్టిలైజర్స్‌, శ్రీలక్ష్మీ నరసింహ పెస్టిసైడ్స్‌ దుకాణంలో రూ. 2.50 లక్షల విలువైన పెస్టిసైడ్స్‌కు సరైన రికార్డులు లేనట్లు గుర్తించారు. అలాగే యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నార ని తెలుసుకుని అమ్మకాలను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు.

జాతీయ స్థాయి అవార్డు దరఖాస్తుకు గడువు పెంపు

నంద్యాల(న్యూటౌన్‌): జాతీయ స్థాయి ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్‌, ఉన్నత పాఠశాల, ఎయిడెడ్‌ పాఠశాల, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌, సైనిక పాఠశాల, ఏకల్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ఉపాధ్యాయుల్లో 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వారు దరఖాస్తులనుhttp:// nationala wardstoteachers. education. gov. in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపాధ్యా యుల స్వీయ నామినేషన్లు ఈనెల 20లోగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్లు జిరాక్స్‌కాపీలో సమర్పించాలని డీఈఓ జనార్ధన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement