వర్షం కోసం ఎదురుచూపు | - | Sakshi
Sakshi News home page

వర్షం కోసం ఎదురుచూపు

Jul 14 2026 4:29 AM | Updated on Jul 14 2026 4:29 AM

వర్షం కోసం ఎదురుచూపు భూగర్భ జలాలు అడుగంటాయి

వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా గత ఏడాది కంది, మొక్కజొన్న పంటల సాగుతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్‌సీజన్‌పై వర్షాభావ పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ ఏడాది 20 ఎకరాల సొంతం పొలంలో వరి, బెండ, మినుము పంటల సాగుకు పొలాన్ని సిద్ధం చేసుకున్నాను. అదునుకు పదునయ్యే వర్షాల కోసం ఎదురు చూస్తున్నా.

– వెంకటేశ్వరరెడ్డి, రైతు,

కంపమల్ల, కోవెలకుంట్ల మండలం

ఈ ఏడాది నాకున్న నాలుగు ఎకరాల సొంత పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటికే రూ. 50 వేలు వెచ్చించాను. బోరునీటి ఆధారంగా పైరు సాగుచేయగా వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోరులో నీటి ప్రవాహం తగ్గింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దిగుబడులు చేతికందే పరిస్థితి కన్పించడం లేదు. – నాగరాజు, రైతు,

పాలసాగరం, ఆళ్లగడ్డ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement