రెండున్నర ఎకరాల్లో మిరప సాగు | - | Sakshi
Sakshi News home page

రెండున్నర ఎకరాల్లో మిరప సాగు

Jul 13 2026 4:37 AM | Updated on Jul 13 2026 4:37 AM

రెండున్నర ఎకరాల్లో మిరప సాగు గతేడాది రూ. 2.50 లక్షలు నష్టపోయా

గత ఏడాది ఒకటిన్నర ఎకరా సొంత పొలంతోపాటు ఎకరా రూ. 20 వేలు కౌలు చెల్లించి మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని నాలుగున్నర ఎకరాల్లో మిరప సాగు చేసి నష్టపోయాను. వాతావరణం అనుకూలించకగా ఎకరాకు 12 క్వింటాళ్లకు మించి దిగబడులు రాలేదు. ఈ ఏడాదైనా నష్టాలు పూడ్చుకోవచ్చని ఆశతో రెండున్నర ఎకరాల సొంత పొలంలో సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నాను.

– కుళాయప్ప, రైతు,

అమడాల, కోవెలకుంట్ల మండలం

గత ఏడాది ఏడు ఎకరాల్లో మిరప సాగు చేసి రూ. 2.50 లక్షల నష్టం వచ్చింది. మార్కెట్‌ గిట్టుబాటు ధర లేకపోవడంతో గుంటూరు కోల్డ్‌ స్టోరేజీలో భద్రపరుచుకున్నాను. ఈ ఏడాది ఎకరాకు రూ. 40 వేలు కౌలు చెల్లించి మూడు ఎకరాలు, సొంతపొలం మరో మూడు ఎకరాల్లో కలిపి ఆరు ఎకరాల్లో మిరప సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకున్నాను.

– రమణారెడ్డి, రైతు,

చిన్నకొప్పెర్ల, కోవెలకుంట్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement