గత ఏడాది రూ.2 కోట్లు రిజర్వులో ఉంచాం | - | Sakshi
Sakshi News home page

గత ఏడాది రూ.2 కోట్లు రిజర్వులో ఉంచాం

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

గత ఏడాది రూ.2 కోట్లు రిజర్వులో ఉంచాం గ్రామాల్లో అభివృద్ధి ఎలా సాధ్యం

గత ఏడాది వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు, పైప్‌లైన్లు తదితర నీటి సమస్యలను తీర్చేందుకు రూ.2 కోట్లను రిజర్వులో ఉంచుకున్నాం. అప్పట్లో రిజర్వులో ఉంచుకున్న మొత్తంతోనే జెడ్పీటీసీల ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో తాగునీటికి సంబంధించిన పనులను చేపట్టాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.కోట్లలో ఉన్న స్టాంప్‌ డ్యూటీ లక్షలకు పడిపోయింది. జెడ్పీకి సొంత ఆదాయ వనరులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడం చాలా బాధాకరం.

– యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌

స్థానిక సంస్థలకు స్టాంప్‌ డ్యూటీ విడుదల చేయకుంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఉంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి పక్కాగా స్థానిక సంస్థలకు నిధులు విడుదలయితే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంప్‌ డ్యూటీని జమ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి.

– పోచా జగదీశ్వరరెడ్డి, జెడ్పీటీసీ, జూపాడుబంగ్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement