త్వరలో నూతన అదనపు కోర్టులు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

త్వరలో నూతన అదనపు కోర్టులు ఏర్పాటు

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

నంద్యాల(వ్యవసాయం): నంద్యాలలో నాలుగు నూతన అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది తెలిపారు. శుక్రవారం కోర్టు కాంప్లెక్స్‌లోని నాలుగు కోర్టులకు సంబంధించిన గదులను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోర్టు కాంప్లెక్స్‌లో తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు అదనపు కోర్టులకు అవసరమైన వసతులు అన్ని ఉన్నాయన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందికి, న్యాయవాదులు, కక్షిదారులకు అవసరమైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందుకు రూ.21 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. ఈనెల 18, 19 తేదీలలో నంద్యాలలో నాలుగు కోర్టులు, నందికొట్కూరులో ఒక కోర్టు, కర్నూలులో రెండు కోర్టులను హైకోర్టు జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి హైకోర్టు అనుమతులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి తంగమణి, రెండవ అదనపు జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులు, ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కర్రి లక్ష్మి, ఆర్డీవో విశ్వనాఽథ్‌, తహసీల్దార్‌ పత్తి శ్రీనివాసులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హుస్సేన్‌ బాషా, జయకృష్ణ, శివశంకర్‌ రెడ్డి, ఏపీపీ రాజేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి, గౌరీ శంకర్‌ తదితర కోర్టు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement