● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
ఆత్మకూరు: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన కార్యకర్తలతో కలిసి రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలను కించపరిచేలా రాధాకృష్ణ మాట్లాడడం సరికాదన్నారు. ఆయనకూ భార్యాపిల్లలు ఉన్నారని, మహిళల విషయంలో సభ్యసమాజం తలదించుకు నేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జర్నలిస్టులుగా నైతిక విలువలను కాపాడాల్సిన వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన మహిళలపై దురుసుగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక, చానళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ పాలనలో లబ్ధి పొందేందుకు రోత పలుకులు పలికారని విమర్శించారు. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అంతకుముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దేశం తిరుపంరెడ్డి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల పార్టీ అధ్యక్షులు సయ్యద్‌మీర్, రాజమోహన్‌రెడ్డి, అంబాల ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆత్మకూరు, వెలుగోడు మండలాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.


