పీవీఎస్‌ఆర్ క్రషర్ పరిశ్రమకు నిప్పు
దొర్నిపాడు: ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామ శివారులోని జాతీయ రహదారి 40కిలోమీటర్ల సమీపంలో ఉన్న పీవీఎస్‌ఆర్ క్రషర్ పరిశ్రమకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ క్రషర్ పరిశ్రమ దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పయిడేల శివరామిరెడ్డికి చెందినది. సెక్యూరిటీ సిబ్బంది భోజనం చేసే సమయంలో వెనుక నుంచి వచ్చి దుండగులు నిప్పుపెట్టారు. వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. రూ.లక్షలు విలు వ చేసే పట్టలు, కన్వేయర్ బెల్టులు కాలిబూడిదయ్యా యి. దుండగులు తమ వెంట క్యాన్‌లో పెట్రోల్ తీసుకొచ్చి నిప్పుపెట్టినట్లుగా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పెట్రో క్యాన్ లభించడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. రాజకీయ కక్షతోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారని బాధితులు అనుమానిస్తున్నా రు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ వరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని క్రషర్‌ను పరిశీలించారు. రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
పీవీఎస్‌ఆర్ క్రషర్ పరిశ్రమకు నిప్పు


