సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కర్నూలు: మారుతున్న నేరాలకు అనుగుణంగా విధి నిర్వహణలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ కానిస్టేబుళ్లకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నూతనంగా ఎంపికై శిక్షణ నిమిత్తం కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కళాశాలకు(డీటీసీ) వచ్చిన 205 మంది ఏపీఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లకు ఎస్పీ బుధవారం దిశానిర్దేశం చేశారు. అమీలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ట్రైనీ కానిస్టేబుళ్లకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి ముందు జాగ్రత్తలతో అందరికీ టీటీ ఇంజెక్షన్లు వేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లనుద్దేశించి మాట్లాడారు. శిక్షణ సమయంలో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. నూతన చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే వృత్తిలో రాణింపు సాధ్యమన్నారు. శిక్షణలో పొందుపరచిన ప్రతి అంశం వృత్తిపరంగా నైపుణ్యులుగా తీర్చిదిద్దేందుకేనని గ్రహించాలన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీటీసీ వైస్ ప్రిన్సిపల్ దుర్గప్రసాద్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి


