మహిళ ఆత్మహత్య
కొత్తపల్లి: కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని ఎదురుపాడు గ్రామపంచాయతీలో మజరా గ్రామమైన జడ్డువారిపల్లె గ్రామానికి చెందిన కదిరి వెంకటేశ్వర్లు ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం లింగాల మండలం ఆమిడిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(40)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె మొదటి భర్తకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న లక్ష్మిదేవి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం జడ్డువారిపల్లె ఇంట్లోనే పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. భర్త కదిరి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు బుధవారం తెలిపారు.


