వాన కురిసేనా.. మొక్క బతికేనా! | - | Sakshi
Sakshi News home page

వాన కురిసేనా.. మొక్క బతికేనా!

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వన మహోత్సవానికి మంగళవారం నుంచి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుడుతోంది. జిల్లావ్యాప్తంగా సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో 2026–27 సంవత్సరంలో మొత్తం 57.70 లక్షల మొక్కలు నాటేలా శాఖల వారీ లక్ష్యం నిర్దేశించింది. ఇప్పటి వరకు 13.18 లక్షలు మొక్కలు నాటగా, ఇంకా.. 44.52 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షాలు ఎంత మేరకు కురుస్తాయి.. ఎంత మేరకు ఆ మొక్కలను బతికించుకోగలుతామన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రతి ఇంటికీ రెండు మొక్కలు

వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు మొక్కలు అందిచనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాల ప్రాంగణాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంచాలని సూచించింది. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, మున్సిపల్‌ చైర్మన్లు తదితరులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులు నిర్ణయించారు. కార్యక్రమం రోజున మొక్కలు నాటి వదిలేయకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

జియో ట్యాగింగ్‌ తప్పనిసరి

నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేసి, టీజీ ఫారెస్ట్‌ పోర్టల్‌లో వివరాలను అప్‌లోడ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మొక్క ఎక్కడ నాటారు, దాని సంరక్షణ ఎలా ఉంది అనే వివరాలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. మొక్కల సంఖ్య కంటే వాటి మనుగడకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి

రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో మొక్కలు నాటేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆగస్టు 25 నుంచి ప్రారంభమయ్యే మాస్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత శాఖలను ఆదేశించారు.

నాటిన మొక్కలు బతికితేనే అసలు విజయం

జిల్లా లక్ష్యంలో ఇప్పటికే 13.18 లక్షల మొక్కలను నాటిన ప్రభుత్వం మరో 21.08 లక్షల మొక్కలను పంపిణీ చేసింది. వాటితోపాటు మిగితా 23.44 లక్షల మొక్కలను పంపిణీ చేసి నాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ లకా్‌ష్య్‌న్ని పూర్తి చేయడం కంటే నాటిన మొక్కల మనుగడే ఇప్పుడు ప్రధాన సవాల్‌గా మారింది. ముఖ్యంగా తక్కువ ప్రగతి నమోదైన మండలాల్లో వేగం పెంచడంతో పాటు నీటి సదుపాయం, కంచెలు, సంరక్షణ, నిరంతర పర్యవేక్షణపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. మొక్క నాటడం ఒకరోజు కార్యక్రమం.. దాన్ని చెట్టుగా తీర్చిదిద్దడం మాత్రం నిరంతర బాధ్యత.

హార్టికల్చర్‌లో వెనుకంజ

మొక్కల నాటే కార్యక్రమంతో పాటు ఉద్యాన పంటల విస్తరణకు కూడా లకా్‌ష్య్‌లు నిర్దేశించారు. జిల్లాలో 2,800 ఎకరాల్లో హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 613 ఎకరాలను గుర్తించగా, 554 ఎకరాల్లో పిట్టింగ్‌ పూర్తయింది. అయితే ఇప్పటివరకు 374 ఎకరాల్లో మాత్రమే ప్లాంటింగ్‌ చేపట్టారు. దీంతో లక్ష్యంలో 13.36 శాతం మాత్రమే ప్లాంటింగ్‌ ప్రగతి నమోదైంది. మండలాల వారీగా నాంపల్లి 60.87 శాతంతో ముందంజలో ఉంది.

శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యం ఇలా..

నేటి నుంచి మరో విడత వనమహోత్సవం

ఫ 57 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం

ఫ శాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు

ఫ వర్షం పడితేనే ముందుకు సాగనున్న కార్యక్రమం

ఫ సెప్టెంబర్‌ చివరి నాటికి మాస్‌ ప్లాంటేషన్‌ పూర్తి చేయాలని ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement