నల్లగొండ టూటౌన్ : కనగల్ మండల కేంద్రం ఎక్స్ రోడ్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ సోమవారం నల్లగొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దీనిపై ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశామన్నారు. ఈ విషయంలో మంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, బీజేపీ నాయకులు మాదగాని శ్రీనివాస్‌గౌడ్, గోలి మధుసూదన్‌రెడ్డి, చింత ముత్యాల్‌రావు, లింగస్వామి, దూదల భిక్షంగౌడ్, పకీరు మోహన్‌రెడ్డి, పెరిక మునికుమార్, పెరిక నరసింహ, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.


