మా సారు.. మాకే కావాలి | - | Sakshi
Sakshi News home page

మా సారు.. మాకే కావాలి

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

తిప్పర్తి : మండలంలోని మామిడాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డిని డిప్యూటేషన్‌పై జొన్నగడ్డలగూడెం పాఠశాలకు పంపారు. దీంతో ‘మా సారు.. మాకే కావాలి’ అని మామిడాల సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను బంద్‌ చేశారు. పాఠశాలలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సైదులు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి గ్రామంలో మైకు పట్టుకొని ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారని.. 21మంది కొత్తగా పాఠశాలలో చేరారని తెలిపారు. ఆ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపించడం సరికాదన్నారు. ఈ విషయంపై ఎంఈఓ నర్సింహనాయక్‌ను వివరణ కోరగా.. జొన్నగడ్డలగూడెం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉండడం వల్ల మామిడాల నుంచి ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపామన్నారు. తాత్కాలికంగా డిప్యూటేషన్‌ రద్దు చేసి.. గ్రామస్తుల ఆందోళన విషయాన్ని పైఅధికారులకు తెలియజేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఫ ఉపాధ్యాయుడి డిప్యూటేషన్‌ రద్దు

చేయాలని మామిడాలలో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement