నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎవరైనా సిబ్బంది లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించే బోర్డుపై ఉన్న ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన బోర్డుపై అప్పటి సూపరింటెండెంట్ ఫోన్ నంబరే ఉంచారు. అది ఇప్పుడు పని చేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సమస్యపై కలెక్టరేట్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే.. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కానీ, ఆ నంబర్ పనిచేయకపోవడంతో ప్రభుత్వ ఉద్దేశం నీరుగారిపోతోంది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ నల్లగొండ


