
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
నల్లగొండ టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్‌లో జరిగిన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై శ్రద్ధ పెట్టాలన్నారు. సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు సాగునీటి విడుదల చేసేందుకు వెంటనే షెడ్యూల్ ప్రకటించాలన్నారు. నిరంతరం సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేసి పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేశ్, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, హశం తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి