
యాంత్రీకరణకు నిధులు
కమిటీల ద్వారా ఎంపిక..
అర్హులైన లబ్ధిదారుల నుంచి గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏఈఓల ద్వారా వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలోని వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో కమిటీ స్క్రూట్నీ చేసి జిల్లా వ్యవసాయ అధికారికి పంపుతుంది. అక్కడ జాబితాను తయారు చేసి కలెక్టర్ అనుమతితో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపికై న రైతులకు అక్టోబర్ చివరి నాటికి పరికరాలను అందించే విధంలా ప్రణాళిక రూపొందించారు.
ఫ రూ.3.14 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
ఫ ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
ఫ అక్టోబర్ చివరివారంలో పరికరాలు అందజేసేలా జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక
నల్లగొండ అగ్రికల్చర్ : రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేసే.. యాంత్రీకరణ పథకానికి నిధులు మంజూరయ్యాయి. పథఽకం అమలు కోసం జిల్లాకు రూ.3.14 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) పథకం కింద ఈ నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఈ పథకం కోసం గత యాసంగిలోనే ప్రక్రియ ప్రారంభించినప్పటికీ మార్చి బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల నిధులు రాలేదు. ప్రస్తుతం ముందస్తుగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఆగస్టు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పరికరాల కోసం నుంచి ఆగస్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50 శాతం, జనరల్ కేటగిరి రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు. ఫిబ్రవరిలోనే రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులను స్వీకరించింది. వాటితోపాటు ఆగస్టు 5 నుంచి తీసుకునే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి 21 నుంచి 27వ తేదీ వరకు ఎంపికై న రైతుల నుంచి సబ్సిడీ పోను పెట్టుబడి వాటాను డీడీల రూపంలో తీసుకోనున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 5 వరకు ఎంపికై న రైతులకు పరికరాల మంజూరీ ఉత్తర్వులను అందజేస్తారు. అక్టోబరు చివరి వారంలో లబ్ధిదారులకు పరికరాలను అందజేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.
15 రకాల పరికరాలు అందజేత..
యాంత్రికరణలో భాగంగా రోటోవేటర్, ఎంబీ ప్లగ్, అల్టివేటర్, డిస్క్ యారో, కేజీవీల్, బండ్ పార్మర్, రోడో పడ్లర్, పవర్ టిల్లర్, సీడ్ ఫ్రం పర్టిలైజర్ డ్రిల్, మాన్యువల్ స్ప్రేయర్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రే, పవర్ వీడర్, బ్రష్‌కట్టర్, స్ట్రా బేలర్స్ తదితర పరికరాలను రైతులకు సబ్సిడీపై అందజేయనున్నారు.
రైతులు దరఖాస్తు చేసుకోవాలి...
జిల్లాలోని అర్హులైన రైతులు వ్యవసాయ యాంత్రికరణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందజేస్తాం. అక్టోబరు చివరి నాటికి పరికరాలను పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించాం.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి