
సారూ.. మా గోడు ఆలకించరూ..!
నల్లగొండ : సారూ.. మా సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరుతూ పలువురు బాధితులు కలెక్టరేట్‌లో పిర్యాదులు సమర్పించారు. సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్ల మంజూరు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. వినతులు స్వీకరించిన కలెక్టర్ వాటి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
నాకు చిన్నప్పటి నుంచి కాళ్లు పని చేయడం లేదు. ఇన్నాళ్లూ మా నన్ను సాకింది. మా అమ్మ పెద్ద మనిషి. ఆమె పని చేయలేదు. ఇద్దరం ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే జీవనం గడుపుతున్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
– ఏర్పుల మల్లయ్య, చర్లపల్లి, దివ్యాంగుడు
మా అమ్మకు పింఛన్ ఇప్పించండి
మా నాన్న తుపాకుల రాములు స్వతంత్య్ర సమరయోధుడు. ఆయన చనిపోయి ఆరు నెలలైంది. మా నాన్న పింఛన్ మా అమ్మకు మంజూరు చేయాలని దరఖాస్తు చేసాం. ఆరు నెలలైనా ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ విషయంలో అధికారులు వెంటనే మా అమ్మ తుపాకుల నర్సమ్మకు పింఛన్ అందేలా చూడాలి. – లక్ష్మయ్య, మిర్యాలగూడ
భూమి పట్టా చేసుకుని పట్టించుకోవడం లేదు
నా మనవడు మమ్ములను సాదుతానని చెప్పి మా పేరున ఉన్న ఎకరం 10 గుంటల భూమి పట్టా చేయించుకుండు. ఇప్పుడు సాదడం లేదు. నా చిన్న కొడుకుకు మాటలు రావు. మేము ముగ్గురం ఆ భూమి మీదే ఆదారపడి జీవించాలి. నా పెద్ద కొడుకు కుమారుడైన శ్రీనివాస్ మమ్మల్ని సాదుతానని చెప్పి పట్టా చేయించుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. విషయం అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి. – జడల మట్టమ్మ, రామచంద్రు, నేతాపురం, తిరుమలగిరి సాగర్ మండలం
ఫ గ్రీవెన్స్‌లో బాధితుల వినతి
ఫ ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్

సారూ.. మా గోడు ఆలకించరూ..!

సారూ.. మా గోడు ఆలకించరూ..!

సారూ.. మా గోడు ఆలకించరూ..!

సారూ.. మా గోడు ఆలకించరూ..!