సన్న బియ్యం పంపిణీ.. చరిత్రాత్మకం
నల్లగొండ: ఆహార భద్రత కల్పించడంలో భాగంగా నిరుపేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ పథకంలో 80 శాతానికి పైచిలుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు లబ్ధిపొందనున్నారని తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 99 శాతం మేర పూర్తి కాగా మరికొన్ని జిల్లాల్లో పంపిణీ వేగవంతమైందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఇన్‌చార్జి డీఎస్‌ఓ హరీష్ తదితరులు హాజరయ్యారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


