సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌కు పదోన్నతి
మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్‌ను బదిలీ అయ్యారు. ఆయనను నారాయణ్‌పేట జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేసింది. నారాయణ్ అమిత్ 2024 సెప్టెంబర్ 5న మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన పేదలందరికీ అందించేందుకు కృషి చేశారు. అక్రమదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేశారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడంతో జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు.
పుల్లెలంలో రేపు
హనుమంతు అంత్యక్రియలు
చండూరు : ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అంత్యక్రియలు స్వగ్రామమైన చండూరు మండలంలోని పుల్లెంలలో ఆదివారం జరుగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రానికి ఒడిశా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి పుల్లెంలకు హనుమంతు పార్థివదేహాన్ని తీసుకొస్తారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు పుల్లెంలలోని పాత ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. అంత్యక్రియల ఏర్పాట్లను హనుమంతు బావ మల్లిక్ పరిశీలించి గ్రామంలోని ముఖ్యులతో సమావేశమై చర్చించారు.
సీసీఐ కేంద్రం తనిఖీ
చిట్యాల : చిట్యాల పట్టణ శివారులోని కృష్ణ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవల ఈ కేంద్రం పత్తిని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేసిన నేపథ్యంలో అధికారులు తనిఖీ చేపట్టారు. సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు తీరును పరిశీలించారు. స్లాట్ బుకింగ్‌లో ఏర్పడుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ సీరియల్ ప్రకారం పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ కేంద్రం నిర్వాహకులకు సూచించారు.
నేటి నుంచి డిండి ఉర్సు
డిండి: మండల కేంద్రంలోని హజ్రత్ ఖాజా సయ్యద్ షా యూసుపొద్దీన్ దర్గా 77వ ఉర్సె షరీఫ్‌ను శని, ఆదివారం రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి సయ్యద్ షర్పొద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం గంధోత్సవం, ఆదివారం దీపారాధన, ఖత్మేఖునాన్ వంటి పూజా కార్యక్రమాలతోపాటు ఖవ్వాలి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కుల మతాల కతితంగా ఉర్సును విజయవంతం చేయాలని కోరారు. ఉర్సుకు హాజరయ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ధనుర్మాస వ్రత పూజలు
హాలియా : పట్టణంలోని స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గోవర్ధన రాఘవాచార్యులు పర్యవేక్షణలో అష్టాక్షరి సహిత సుదర్శన నరసింహ హోమం, లోక కల్యాణార్థం కోసం కోసం నిత్య మూల మంత్ర హోమం, భగవతారాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, నిత్య పూర్ణహుతి తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అరుణ, చంద్రకళ, లావణ్య, సుమలత, వరలక్ష్మి, శోభారాణి, శేఖర్, సాయి చందు ఉన్నారు.
సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌కు పదోన్నతి
సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌కు పదోన్నతి
సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌కు పదోన్నతి


